ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన * దొమ్మేటి పల్లవి వెంకటరావు
పయనించే సూర్యుడు జనవరి 26 ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయితీ వద్ద పంచాయతీ సర్పంచ్ దొమ్మేటి పల్ల వెంకటరావు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ నిర్మాతలకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డ్ నెంబర్ (బిజెపి జిల్లా ట్రెజరర్) గంధి నానాజీ
ఈ సందర్భంగా మాట్లాడుతూ: “భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలే మన దేశ పురోగతికి పునాదులు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వారు రచించిన రాజ్యాంగం వల్లనే నేడు సామాన్యులకు కూడా సమానమైన అవకాశాలు దక్కుతున్నాయి. అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.అనంతరం కార్యాలయంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమలాపురపు సురేష్ తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు గువ్వల సత్తిబాబు అయినా పరుపు సుబ్రహ్మణ్యం , వార్డ్ నెంబర్ సంసాని సత్తిబాబు పాకలపాటి త్రినాథ్ వర్మ, అల్లూరు సోమరాజు, పోలవరపు వెంకటరమణ, వీఆర్వో ,వీఆర్ఏ, పంచాయితీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, డోక్రా యూనివెర్టర్ ,దొమ్మేటి గోపాల్ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
