ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: MEO కరిముల్లా
{పయనించే సూర్యుడు} {మార్చు 1మరికల్ }
తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి MEO కరీముల్లా.ribbon cut చేయగా, గ్రామ సర్పంచ్ మురళి.జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను, ప్రదర్శించిన ప్రయోగాలను తిలకించి, వారి ప్రతిభను అభినందించారు. శాస్త్రీయ దృక్పథంతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సైన్స్ మన జీవన విధానంలోనే ఒక భాగం గా ఉంది సైన్స్ లేని దేజీవితం లేదని పేర్కొన్నారు అనంతరం ఆయన పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతను తనిఖీ చేసి, బియ్యము నాణ్యత బాగాలేదని, బియ్యాన్ని వాపసు చేసి నాణ్యమైన బియ్యాన్ని తిరిగి తీసుకోవాలని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సైన్స్ ప్రదర్శనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు చంద్రమౌళి.విద్యార్థులకు విశేషమైన మార్గదర్శకత్వం వహించారు. విద్యార్థుల చేత వినూత్నమైన సైన్స్ నమూనాలను తయారు చేయించి ప్రదర్శనను ఆకట్టుకునేలా రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్ కుమార్, గ్రామ వార్డు సభ్యులు శివాజీయువజన సంఘాo అధ్యక్షులు గడ్డమీది శీను, విద్యాభిమానులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు రాములు గౌడ్, వెంకటేశ్వరమ్మ, తౌసిఫ్, అశోక్ కుమార్, శ్రావణి మరియు ఇతర సిబ్బంది పాల్గొని కార్యక్రమ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర నిర్వహించారు . విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టుల పనితీరును అతిథులకు వివరించడం అందరినీ ఆకట్టుకుంది. చివర్లో సైన్సు విషయం పైనక్విజ్ నిర్వహించి మొదటి రెండవ మూడవ బహుమతులను ఇవ్వడం జరిగింది
