PS Telugu News
Epaper

ఘనంగా డా.అంబేద్కర్ 69వ వర్ధంతి

📅 06 Dec 2025 ⏱️ 3:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రాజ్యాంగాన్ని మార్చే బిజెపిని స్థానిక సంస్థలలో బొంద పెడదాం

ప్రశ్నించే గొంతుకల రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న మోదీ,అమిత్ షా వైఖరి నశించాలి

//పయనించే సూర్యుడు// //డిసెంబర్ 6 మక్తల్//

అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ పట్టణంలోనే అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినా అంబేద్కర్ చిన్ననాటి నుండి వివక్షతను ఎదుర్కొని అంచలంచలుగా ఎదుగుతూ బడుగు బలహీన వర్గాల సామాజిక,ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే విధంగా రాజ్యాంగాన్ని రచించి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరొందారన్నారు.అదేవిధంగా సామాన్య స్థాయి నుండి ప్రధానమంత్రి కావడానికి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని చెప్పే నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా డాక్టర్ అంబేద్కర్ను అవమానించే నీచ సంస్కృతికి పాల్పడినా కూడా ముక్కున వేలేసుకున్నారని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా అంబేద్కర్ తన జీవితాంతం పీడితుల,దళితుల హక్కులకై పోరాటం చేసి రాజ్యాంగంలో పొందు పరిచిన హక్కుల ఆధారంగా కుల గణనను చేపట్టి అధికారంలో వాటా కోసం ఉద్యమం చేస్తున్న పట్టించుకోకుండా అగ్రకుల ఆధిపత్యానికి కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వానికి రాబోవు ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కొరకు,రాజ్యాంగం హామీ పడ్డ లౌకిక స్వేచ్ఛ,సాంఘిక సమానత్వ హక్కుల కొరకు ప్రశ్నించే గొంతుకలను బీజేపీ పాలకులు అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేస్తున్నరన్నారు.దేశాన్ని కార్పోరేట్ హిందూకరణ దేశంగా మార్చే కుట్రలో భాగంగానే అటవీ సంపదను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతూ అమాయక ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో పొట్టన పెట్టుకుంటున్న బీజేపీ మతోన్మాద కుట్రలను తిప్పికొట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు వెంకటేష్,కెన్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, టీవీవి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, అంబేద్కర్ సంగం సలహాదారులు పోలప్ప, ఆర్టిఐ నాయకులు నారాయణ, డిటిఎఫ్ జిల్లా నాయకులు పరంధాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు నగేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నారాయణ, పెద్ద అంజప్ప, జుట్ల అంజప్ప, రాములు కొలిమి,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ నాయకులు అప్రోజ్, మాజీ అధ్యక్షుల బీఎస్పీ కోరి మారెప్ప,న్యాయవాది దత్తాత్రేయ,మాజీ కౌన్సిలర్స్ మొగులప్ప,హన్మంతు,కాంగ్రెస్ పార్టీ యూత్ మండల ఉపాధ్యక్షులు బ్యాగరీ సురేష్,అంబేద్కర్ యువజన సంఘం ఉప్పరపల్లి అధ్యక్షులు బాలకృష్ణయ్య, బైరంపల్లి అంబేద్కర్ సంగం నాయకులు రవి,ఖానాపూర్ అంబేద్కర్ సంగం నాయకులు రామలింగప్ప,అంజి,అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి రవికుమార్ కోశాధికారి త్రిమూర్తి,టీచర్ నాగేష్, క్రాంతి,అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక సభ్యులు శ్రీహరి బ్యాగరి,తల్వార్ నరేష్,సురేష్,గురు,వెంకటేష్, భాను,శివ, రమేష్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top