పయనించే సూర్యుడు గాంధారి 01/02/25: మార్కండేయ జయంతి పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కలశయాత్ర వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గౌరమ్మ(అమ్మవారి) విగ్రహాన్ని సంఘ భవనం నుంచి మార్కండేయ మందిరం వరకు, మహిళలు కళాశాలను నెత్తినబెట్టుకొని శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీల్పివో సురేందర్ విచ్చేసి భక్తులకు ప్రవచనాలు చేశారు. స్వామికి ఉయ్యాల సేవ, అన్నదానం చేపట్టారు. సంఘ పెద్దలు బండి రాజులు, మహేష్, శ్రీను, రాజు, నారాయణ, శివ,సత్యం, స్వామి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు