ఘనంగా మార్కండేయ స్వామిజయంతి మహోత్సవం
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలో ఉన్న శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం నందు 21 తేదీ బుధవారం మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ వార అభిషేకము, గణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జానపాటి గురుమూర్తి వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాసులు సంఘ సభ్యులు కె. ఫణి బాబు, కే నాగ రంగయ్య, పి చిట్టి స్వామి, జే ప్రసాదు, వి. రాజశేఖర్, ప్రెస్ శ్రీనివాసులు, ప్రెస్ నాగేష్, మురళి కుల బాంధవులు పాల్గొన్నారు.
