PS Telugu News
Epaper

ఘనంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

📅 09 Feb 2026 ⏱️ 5:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పైనించే సూర్యుడు ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి

ముమ్మిడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) 53వ జన్మదిన వేడుకలు కాట్రేనికోన మండలంలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో పి ఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేకును కోసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, యువ నాయకుడు దాట్ల పృద్వి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, తాడి నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుచ్చిబాబు సేవలను కొనియాడారు. అనంతరం కాట్రేనికోన పీహెచ్సీ లో రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. అలాగే కాట్రేనికోన జిల్లా పరిషత్ హైస్కూల్ లో సుమారు 400 మంది విద్యార్థులకు మధ్యాహ్నం ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ,, మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, నీటి సంఘం డిసి ఆకాశం శ్రీనివాస్, నడింపల్లి సుబ్బరాజు, రాష్ట్ర ఆక్వా డైరెక్టర్ విత్తనాల బుజ్జి,ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం మార్కెటింగ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు, బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్, ఇసుక పట్ల వెంకటరమణ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బడుగు పుల్లారావు,వెంట్రు సుధీర్, విత్తనాల వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, సర్పంచ్ రంబాల రమేష్, సర్పంచ్ సీతారామకృష్ణంరాజు, బండారు ఏసు,త్సవటపల్లి నాగు త్సవటపల్లి శ్రీనివాస్,జంగా శ్రీనివాస్, చీకురుమిల్లి చక్రదరరావు,నేలపాటి చెంచలరావు, నూకల దుర్గ బాబు, మోకా బాల ప్రసాద్, గ్రంధి నానాజీ,వనచర్ల నాగేశ్వరరావు, వంగ దుర్గ బాబు,ఎస్ వి ఎస్ రవి వర్మ,జొన్నాడ రాజారావు, సుధా రాఘవేంద్రరావు, గిడ్డి చంటి, కంచర కృష్ణ, మోటమర్రి సత్యనారాయణమూర్తి, ఉచ్చుల నారాయణ,కాండ్రేకుల సత్యప్రసాద్, కొండేటి చినబాబు, వంగా వాసు,పిటి వర్మ, సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Scroll to Top