ఘనంగా 76వ రాజ్యంగ దినోత్సవం
లౌకిక ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి.
ఆదివాసీ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బీజేపీ అమిత్ షా విధానాలను ఖండిద్దాం
రాజ్యాంగానికి విరుద్ధంగా మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్స్ ను నిలిపివేయాలి
రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న పట్టించుకోని సుప్రీంకోర్టు వైఖరి నశించాలి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం.717/1978
{ పయనించే సూర్యుడు} {నవంబర్ 26 మక్తల్}
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మక్తల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో 76వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకున్నాక 1946 ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకై 1947లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్గా 6గురు సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ నియమించిదన్నారు. ఈ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రచించిందని, ఈ రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు రాజ్యాంగ సభలో పాల్గొన్న నాయకులు నిజానికి ముసాయిదా కమిటీలోని సభ్యులలో ఒకరు రాజీనామా చేయగా, మరొకరు చనిపోగా, మరొకరు విదేశాలలో ఉండటం, ఒకరిద్దరూ దేశ రాజకీయాల్లో నిమగ్నమవడం మరియు ఢిల్లీ ప్రాంతానికి దూరంగా ఉండటం మూలాన రాజ్యాంగ నిర్మాణ బారాన్ని డాక్టర్ అంబేద్కర్ తన భుజాలపై మోసాడని మనమంతా ఆయనకు రుణపడి ఉన్నామని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను ఆయన కృషిని కీర్తించడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలల్లో అక్కడక్కడ అంబేద్కర్ ఒక్కరే భారత రాజ్యాంగాన్ని రచించలేదనే కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలను తీసుకోవాలన్నారు.అదే విధంగా డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ,సమానత్వ సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయంతో రూపొందించి వేల సంవత్సరాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతో బ్రాహ్మణీ అగ్రవర్ణాల ఆధిపత్య వ్యవస్థను పెకలించి దళిత బహుజన వర్గాలను గల్లీలో ఉండే వార్డ్ మెంబర్ నుండి ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి వరకు రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశకల్పనకు వీలుగా రాజకీయ,విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల వ్యవస్థను పొందుపరచడం మరియు మహిళలకు, కార్మికులకు ప్రత్యేక హక్కులు కల్పించడన్నారు.దేశంలోని ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ,ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు,ఇష్టం వచ్చిన మత,సంస్కృతి సాంప్రదాయాలను స్వీకరించే హక్కు వంటి ప్రాథమిక హక్కులపై ఉల్లంఘనకు పాల్పడే ప్రభుత్వాలని ఎదుర్కోవడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కుకు రూపకల్పన చేసి మొత్తం రాజ్యాంగానికి ఆత్మవంటిదని ఆర్టికల్ 32 ను కీర్తించడం జరిగింది.కానీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగంపై మతోన్మాద నీలినీడలు ఆల్ముకుంటున్నాయన్నారు.మొన్నటికి మొన్న సనాతన దుర్మార్గుడు రాకేష్ శర్మ అనే వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.ఆర్ గవాయిపై దాడిచేసిన చర్యలు తీసుకోలేదన్నారు.అలాగే మధ్య భారతంలోని ఆదివాసులకు రాజ్యాంగం పేసా చట్టం,5th షెడ్యూల్లో కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ అటవీ సంపదను ఆదానీ,అంబానీ వంటి వారికి చెందిన బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని అడ్డుకుంటున్న ఆదివాసీలను,అలాగే మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని, మానవ హక్కులను అరిస్తున్నారని ఆందోళనలు చేస్తుంటే,సుప్రీంకోర్టు మాత్రం ఏమి పట్టనట్టు చోద్యం చూస్తుందన్నారు. అంతేకాకుండా బిజెపి ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని ఇలాంటి వాటిని ప్రశ్నించే ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులపై అర్బన్ నక్సలైట్లనే ముద్రవేసి బ్రిటిష్ కాలం నాటి UAPA కేసులను బుకాయిస్తున్నారన్నారు.కావున దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు,ప్రజాస్వామిక వాదులు పూలే,అంబేద్కరిస్టులు ఏకమై బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం పై చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా పిలుపునిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బ్యాగరి,కార్యదర్శి బండారి కృష్ణ,బి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి చంద్రశేఖర్, ఎంఐఎం అసెంబ్లీ ఇంచార్జ్ జంషీర్, కేఎన్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, రాములు కొలిమి,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ నాయకులు అప్రోజ్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు సలహాదారులు పోలప్ప, బీఎస్పీ కోరి మారెప్ప, ఆర్టిఐ జిల్లా నాయకులు జి నారాయణ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల ఉపాధ్యక్షులు బ్యాగరీ సురేష్,అంబేద్కర్ యువజన సంఘం ఉప్పరపల్లి అధ్యక్షులు బాలకృష్ణయ్య,ఉపాధ్యక్షులు యువరాజ్, అంబేద్కర్ యువజన సంఘం పర్మం దొడ్డి ప్రధాన కార్యదర్శి పళ్ళ రాజేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు జగ్గలి అంజప్ప,మొగ్ధంపూర్ మాజీ సర్పంచ్ మోహన్, అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి రవికుమార్ కోశాధికారి త్రిమూర్తి, కార్యవర్గ సభ్యులు కర్రెమ్ ఆంజనేయులు ,అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల నాయకులు నర్సింగప్ప కేఎన్పిఎస్, DSP తిమ్మరాజు,బ్యాగరి శ్రీహరి,గోప్లాపురం ఆంజనేయులు, పెయింటర్ వెంకటేష్, సందీప్,సౌరం భాయ్ అంజప్ప,జుట్ల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
