చండూరు లో ఉత్సాహంగా 5కే రన్*5కే రన్ లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసు , వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 09.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చండూరు మున్సిపాలిటీలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసు , వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ , జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. స్థానిక చండూరు మున్సిపాలిటీ సెంటర్ నుండి ప్రారంభించారు. ఈ పరుగులో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. 5 KM (5 కిలోమీటర్లు లేదా 3.1 మైళ్లు) రన్ అనేది ప్రారంభకులకు మరియు అనుభవజ్ఞులకు ఒక అద్భుతమైన, సాధించగల రన్నింగ్ లక్ష్యం. ఇది కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి మరియు కండరాల బలానికి సహాయపడుతుంది. సాధారణంగా 5K ని పూర్తి చేయడానికి 30-40 నిమిషాలు పడుతుంది, అయితే శిక్షణతో వేగాన్ని పెంచవచ్చు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు ,యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు .
