PS Telugu News
Epaper

చట్టి గ్రామపంచాయతీ పరిధిలో యూరియా పంపిణీ లో ఆదివాసీ జేఏసీ చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మంచినీటి సరఫరా

📅 19 Sep 2025 ⏱️ 5:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు జిల్లా

చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది. దానికి గాను పంచాయతీ పరిధిలోని రైతులు వందలాదిగా రావడం ద్వారా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం తో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసి జేఏసీ చింతూరు మండల కమిటీ వారు యూరియా కోసం విచ్చేసినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా మంచినీటిని ఏర్పాటు చేసి అందరికీ కూడా అందించడం జరిగింది.దీనికిగాను గ్రామ పెద్దలు,యువత ఆదివాసీ జేఏసీ కమిటీ ను అభినందించడం జరిగింది . మీరు ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ మండల చైర్మన్ పొడియం రామకృష్ణ,తుర్రం నీలారాజు,వెంకటనారాయణ,మూర్తి,సీతరామయ్య యువత పాల్గొన్నారు

Scroll to Top