చలో మంగళగిరి 22న చేనేత గర్జన జయప్రదం చేయండి
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలూరు లక్ష్మయ్య ఆధ్వర్యంలో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పామిశెట్టి గోవిందు జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ మామిళ్ళ నారాయణస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ సోమశేఖర్ పట్టు చీరలు ఉత్పత్తిదారులు పళ్ళ చితంబరి పులిచెర్ల శ్రీనివాసులు లింగం చంద్రశేఖర్ పురుషోత్తం జూటూరు రఫీ మరియు చేనేత కార్మికులు పుట్లూరు నరసింహయ్య రంగం ఓబులయ్య పులికొండ రామరాజు పామిశెట్టి జయరాముడు ఉడుముల సంజీవులు చింతా నాగేశ్వరయ్య అచ్చుకట్ల హాజీ ఫిరా సోమశేఖర్ పెద్దకోట్ల శ్రీనివాసులు కోదండరావ్ జానపాటి స్వామి పోసా చోడయ్య తదితరులు 40 మంది ఈ సమావేశంలో పాల్గొనడం జరిగినది ప్రధాన డిమాండ్స్ చేనేతలకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలి నేతన్న నేస్తం 25 వేల రూపాయలు ఇవ్వాలి చేనేతలకు ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు అమలు చేయాలి చేనేతలకు ముడి పట్టు 50% రాయితీతో ఇవ్వాలి ఆదరణ పథకం కింద చేనేతలకి 90% సబ్సిడీతో ఆధునిక మగ్గం పరికరాలను ఇవ్వాలి చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఆరు నెలలపాటు నెలకు 5000 రూపాయలు ఇవ్వాలి ఇల్లు లేని చేనేతలకు మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇవ్వాలి చేనేతలకు వర్క్ షెడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలి 50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి చేనేతపై జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలి చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఐదు లక్షల రూపాయలు 50% సబ్సిడీతో ఇవ్వాలి చేనేత 11 రకాల 1985 రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరియు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
