PS Telugu News
Epaper

చికడపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం…

📅 26 Dec 2025 ⏱️ 3:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్. మండల ప్రతినిధి)

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లయన్స్ కంటి ఆసుపత్రిలో జిల్లా గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చే రుద్రూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా బారి మెజారిటీతో ఎన్నికైన సందర్బంగా ఇంటర్నేషనల్ లయన్స్ పిన్ తో పాటు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు లయన్స్ మాజీ గవర్నర్ లయన్ పి.బసవేశ్వర రావు మాట్లాడుతూ.. పిన్న వయసులో ఉండి లయన్స్ క్లబ్ రుద్రూర్ సభ్యులుగా కొనసాగుతూ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి బారి మెజారిటీతో గెలవడం ఎంతో గర్వంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒకటవ గవర్నర్ లయన్ విజయలక్ష్మి, రెండవ గవర్నర్ లయన్ నర్సింహ రాజు, ఇందూర్ స్కూల్స్ అధినేత లయన్ కొడాలి కిషోర్, కమ్మ సంగం అధ్యక్షులు లయన్ శివన్నారాయణ, రుద్రూర్ క్లబ్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్, జిల్లా అధ్యక్షులు లయన్ శ్యామ్ సుందర్ పహడే, సభ్యులు లయన్ పార్వతి ప్రశాంత్, లయన్ నారోజీ గంగాధర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top