చిక్కడపల్లిలో పశువుల నీటి తొట్టెలు శుభ్రం చేయిస్తున్న సర్పంచ్..
రుద్రూర్, డిసెంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో పశువులు తాగే నీటి తొట్టెలు అపరి శుభ్రంగా మరడంతో గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్ నీటి తోట్టేలను శుభ్రం చేయించారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో పనులు చేయిస్తుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్ల కళ్యాణ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.