PS Telugu News
Epaper

చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ..

📅 29 Dec 2025 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

జిల్లా ట్రాస్మా అధ్యక్షులు, ఇందూర్ పాఠశాలల అధినేత లయన్ కోడాలి కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సోమవారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ రుద్రూర్ అధ్యక్షులు మాట్లాడుతూ.. లయన్ కోడాలి కిషోర్ ఎప్పుడు సేవ భావంతో వుండే వ్యక్తి అని, ఆయన చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు. ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుడిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లయన్ శ్యామ్ సుందర్ పహడే, కార్యవర్గ సభ్యులు లయన్స్ పుట్టి సాగర్, మధు, శ్రీకాంత్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు రత్న కుమారి, రుక్మిణి, సాయిలీల, ఆయమ్మలు, చిన్నారులు పాల్గొన్నారు.

Scroll to Top