చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నాయకులు
చిన్నారుల ఆరోగ్య రక్షణకు పల్స్ పోలియో చుక్కలు
పయనించే సూర్యుడు జూన్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కో జిల్లా కాట్రేనికోన
మండల కేంద్రమైన పీహెచ్సీలో ఆదివారం జాతీయ పోలియో చుక్కల కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. చిన్నారులకు నాయకులు స్వయంగా చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రారంభించిన ప్రముఖులు:మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావుబీజేపీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీతహసీల్దార్ రవి కిరణ్ డాక్టర్ ఎం లికిత మేడం మోక అప్పాజీ వాసంశెట్టి రాజేశ్వరరావు తదితరులునాయకులు చిన్నారులకు ప్రేమగా పోలియో చుక్కలు వేసి, తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరించారు.డాక్టర్ లిఖిత మేడం మాట్లాడుతూ… “5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి. మండలంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడి కేంద్రాలు, బస్టాండ్లు మరియు ఇతర ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు చుక్కలు వేసేందుకు అందుబాటులో ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా సమీప కేంద్రానికి తీసుకెళ్లి చుక్కలు వేయించాలి” అని కోరారు.పోలియో రహిత భారతదేశం సాధించేందుకు ఇది కీలకమైన అడుగు అని నాయకులు తెలిపారు. ఒక్క చుక్కతో పిల్లల భవిష్యత్తు సురక్షితమవుతుందని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సి హెచ్ ఓ శేషుబాబు, ఆర్ శ్రీపతిరావు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.