భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించిన ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్

June 28, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ; ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తు .వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper