చిమ్మ చీకట్లో నాదెండ్ల వారి కండ్రిగ నిద్రపోతున్న యంత్రాంగం
పయనించే సూర్యుడు మార్చి 6 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం నాదెOడ్ల వారి కండ్రిగ గ్రామంలో వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు హైవే నుంచి నాదెండ్ల వారి కండ్రిగ సుమారు ఒక కిలోమీటర్ ఉంటుంది పొలాల గుండా చెట్ల మధ్య సందులో నుంచి రాత్రుల్లో నడిచి వెళ్ళవలెను దారి గుండా పాములు ఉండొచ్చు పురుగులు ఉండొచ్చు విశ్వసర్పాలు తిరిగి దారి గుండా వెళ్లాలి బస్సు సౌకర్యం లేదు ఉన్నవాడు బైక్ పైన వెళ్తాడు లేనివాడు కాలిబాటన వెలవలెను ఇలాంటి విష సర్పాలు తిరిగే రోడ్లకుండా కాలి బాటన వెళుతుంటే జరగరానిది ఏదైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చీకటి పడిందంటే నాదెండ్ల వారి కండ్రిగ మహిళల గుండెల్లో వణుకు పుడుతుంది దారిగుండ వెళుతుంటే మందుబాబులు ఆగడాలు ఎవరో గుర్తుతెలియని ఆగంతుకులు ఆ దారి గుండు వెళ్తుంటే మనుషులపైన రాళ్లతో దాడి ఇలాంటి దారి గుండా మహిళ గాని చిన్న పిల్లల గాని వెళ్లాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మహాప్రభో ప్రపంచం ఎంతో ముందుకు వెళుతుంటే ఇలాంటి హైవే పక్కన ఉన్న చిన్న ఊరి కూడా లైట్లు వేయలేని స్థితిలో సూళ్లూరు పేట నియోజకవర్గం ఉందా ఒకాయన ఏమో డిప్యూటీ సీఎం రోడ్లు లేని మారుమూరపల్లిలో కూడా రోడ్లు వేస్తున్నారు కరెంటు లేని మారుమూల పల్లెటూరు కూడా కరెంట్ తీసుకెళ్తున్నారు అలాంటి డిప్యూటీ సీఎం ఉన్న ఆంధ్రప్రదేశ్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో హైవే పక్కన ఆనుకొని ఉన్న నాదెండ్ల వారి కండ్రిగ కి వీధిలైట్లు లేకపోవడం ముమ్మాటికి అధికార నిర్లక్ష్యమే ఆ దారి గుండె వెళ్లే వారికి ఏ ప్రాబ్లం జరగకముందే అక్కడున్న ప్రాబ్లం ని క్లియర్ చెయ్యాలి ప్రాబ్లం జరిగిన తర్వాత క్లియర్ చేస్తే ఏ ప్రయోజనం ఉండదు అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు
