PS Telugu News
Epaper

“చిరంజీవి, వెంకటేష్‌లతో ప్రత్యేక గీతం: అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 500 మంది డ్యాన్సర్లతో షూట్”

📅 01 Dec 2025 ⏱️ 4:15 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.  పండక్కి వస్తున్నారు అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, సాంగ్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక మీసాల పిల్ల మీద వస్తున్న మీమ్స్ అయితే అందరినీ నవ్విస్తున్నాయి. ఆ పాట మీద కూడా చాలానే ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మొత్తానికి ఏదో రకంగా మీసాల పిల్ల అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. చిరంజీవితో పాటుగా ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నట్టుగా తెలిసిందే. వీరిద్దరినీ ఒకే పాటలో ఒకే స్టెప్పులు చూపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన అనిల్ రావిపూడికి వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఓ సీన్ కూడా ఉందట. ఇక ఆ పాటని ఎంతో కలర్ ఫుల్‌గా చూపించాలని ఫిక్స్ అయ్యాడట అనిల్ రావిపూడి. అందుకే భారీ సెట్ వేసి, రంగులతో నింపేశాడట. 500 మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.ఈ సాంగ్‌కి జనాలు అంతా ఫిదా అవుతారని, చిరు వెంకీ కలిసి వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌కి కన్నులవిందుగా ఉంటుందని అంటున్నారు. ఈ సర్ ప్రైజ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆశ్చర్యపోతారు అని టీం చెబుతోంది. ఈ సంక్రాంతికి మాత్రం మరోసారి అనిల్ రావిపూడి మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. వెంకీమామతో 300 కోట్లు కొల్లగొట్టాడు.. మరి చిరంజీవితో 500 కోట్లు రాబడతాడా? లేదా? అని అనుకుంటున్నారు. ఈ సారి పండక్కి ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సాంగ్‌కి జనాలు అంతా ఫిదా అవుతారని, చిరు వెంకీ కలిసి వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌కి కన్నులవిందుగా ఉంటుందని అంటున్నారు. ఈ సర్ ప్రైజ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆశ్చర్యపోతారు అని టీం చెబుతోంది. ఈ సంక్రాంతికి మాత్రం మరోసారి అనిల్ రావిపూడి మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. వెంకీమామతో 300 కోట్లు కొల్లగొట్టాడు.. మరి చిరంజీవితో 500 కోట్లు రాబడతాడా? లేదా? అని అనుకుంటున్నారు. ఈ సారి పండక్కి ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Scroll to Top