చీకటిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం
పయనించే సూర్యుడు జనవరి 12 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు కానీ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండు దగ్గర ఉన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆ మహనీయుడి విగ్రహం దగ్గర లైట్లు ఏర్పరచలేదు ఎందుకు?? అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగాప్రశ్నించారు , భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరి జీవితాల్లో వెలుగుని తెచ్చాడు కానీ ఆ మహనీయుని విగ్రహం చీకట్లో ఉంటుంది . ఈ విద్యుత్ దీపాల గురించి ఎన్నిసార్లు సూళ్లూరుపేట మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ దృష్టి తీసుకెళ్లిన కూడా ఫలితం లేదు ఎందుకని ఏర్పరచలేకపోతున్నారో తెలియదు మున్సిపాలిటీలో లైట్లు వేయడానికి నిధులు లేవా? ఈరోజు ఇతర దేశాల నుండి వలస పక్షులు మన దేశం కొచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న పక్షుల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు జరుపుతున్నారు అందుకు సంతోషం !!!!!కానీ వేడుకకు దగ్గరలో ఉన్న ఆ మహనీయుడు విగ్రహానికి గత నెలలుగా ఒక్క విద్యుత్ దీపం కూడా లేదు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మీకు ఆ మహనీయుని విగ్రహం చీకట్లో ఉందని గుర్తించలేకపోయారా? విదేశాల నుంచి వచ్చిన పక్షులకి కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి పండగ జరుగుతున్నారంటే కూడా మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే జరుపుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలి .. ఆ మహనీయుని విగ్రహానికి శాశ్వత లైట్లు కు అయ్యే ఖర్చు , నిధులు మున్సిపాలిటీలో లేవా?? ఇకనైనా మున్సిపల్ అధికారులు ఆ మహనీయుని విగ్రహం దగ్గర విద్యుత్ దీపాలు ఏర్పరచాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంభాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు
