చీకట్లో వెలుగు కార్తీక పౌర్ణమి వెన్నెల
పయనించే సూర్యుడు నవంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
వెన్నెల దుప్పటి ఆకాశం కప్పుకొని,లోకమంతా పరుచుకున్న రేయంత కర్పూరం చల్లినట్లు
గగన మంతా నిండుకున్నది వెన్నెల,చీకట్లను ఆస్వాదిస్తూ కొండ అంచుల్లో తేలుతుంది వెన్నెల నది నడకల్లా సాగుతూ పరవళ్ళు తొక్కుతున్నది పున్నమి వెన్నెల,కడలి చివర్లో నురుగులా తేలుతూ నింగి వైపు సాగింది వెన్నెల పసిపాప నవ్వుల అలలు ఎగుస్తూ ఆనందం పంచింది నేలకు వెన్నెల,ఆకాశపు తెరపై పాల కుండలా
క్షీరసముద్రపు పొంగులా నిలిచె వెన్నెల కవి రాసిన కవిత చదివేందుకు తెల్లటి కాగితం పై వాలింది వెన్నెల నవ్వుతుంది మల్లె పువ్వులా అర్ధ రాత్రి ఆకాశంలో పూసిన వెన్నెల ఆకాశ ఇంట్లో కూర్చొని చీకట్లలో దీపంలా నిలిచింది వెన్నెల,కొలనులో తనను చూసుకుంటూ కమలములా వికసించింది వెన్నెల,రాత్రి కలలను మెల్లగా స్పృశిస్తూ నిద్ర ఒడిలోకి జారుకున్నది వెన్నెల సూర్యోదయం సమీపిస్తుంటే చేతులెత్తి మొక్కుతో తరలింది వెన్నెల లేత కిరణాల స్పర్శను భూమికి అప్పగిస్తూ తప్పుకుంది వెన్నెల.