చెట్టుకొమ్మ మీదపడి రైతు కూలీ దుర్మరణం
{ పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 29}
చెట్టు కొమ్మ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థాని కుల వివరాల ప్రకారం ప్రకారం. నర్వ మండలం ఉందేకోడ్ కు చెందిన చాకలి రాజు (34) మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద చెట్లు నరికేందుకు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. బుధ వారం ఉదయం పాతర్చేడ్ శివారులోని ఓ రైతు వ్యవసాయ పొలంలో చెట్లు నరికేందుకు వెళ్లాడు. పని చేస్తుండగా అకస్మాత్తుగా పెద్ద చెట్టుకొమ్మ మీద పడింది. బరువు అధికంగా ఉండటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక రైతులు తెలిపారు. మృతు డికి భార్య నర్మద తోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు వెల్లడిం చారు. భార్యాపిల్లల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.