చెయ్యేరు నుండి తరలి వెళ్లిన ” ఆక్వా రైతులు వీరవాసం
పయనించే సూర్యుడు మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధికాట్రేనికోన
ఈ నెల 22 వ తేదీ ఆదివారం జరగనున్న వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో జరిగే ఆక్వా రైతుల సదస్సుకు చెయ్యేరు నుండి కార్ల ర్యాలీతో తరలి వెళ్లినట్లు ఎపి ఆక్వా రైతు సంఘం ఫెడరేషన్ సలహా దారుడు త్సవటపల్లి నాగ భూషణం పేర్కొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మనుగడకు దూరం చేస్తున్న దళారీ వ్యవస్థ నుండి కాపాడాలన్నారు,ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీలో గాని మేతల సబ్సిడీలో గాని రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేక ఇటు దళారి వ్యవస్థ వలన అటు సిండికేట్ వ్యవస్థ వలన మధ్య ఆక్వా రైతుల విలవిలాడుతున్నారని నాగ భూషణం ఆరోపించారు,దళారి వ్యవస్థ నుండి ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా తాత్సారం చేస్తుందంటూ ఆక్వా రైతులు మండిపడుతూ చేసేదేమీ లేక ప్రభుత్వంపై ఉద్యమించడానికి ఉద్యమ బాటకు సిద్ధ పడుతున్నారని నాగ భూషణం పేర్కొన్నారు,
