చైన్ స్నాచి0గ్‌ల అంత రాష్ట్ర ముఠా పైన సూళ్లూరుపేట పోలీసులు ఉక్కు పాదం

July 24, 2026 | తెలంగాణ

పమనిoచే సూర్యుడు జూలై 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.18 లక్షల విలువైన 96 గ్రాముల (12 తులాల) బంగారు ఆభరణాలతో పాటు ఒక కేటీఎం డ్యూక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు​చెన్నైలోని కోరరుక్కుపేటకు చెందిన కె. మోసెస్ (33), మరియదాస్ ఆనంద్ (20) లు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడు మోసెస్ పై తమిళనాడులో 15 కేసులు, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేటల్లో 5 కేసులు ఉన్నాయి. అలాగే మరియదాస్ ఆనంద్ పై తమిళనాడులో 12 కేసులు, ఇక్కడ 5 కేసులు ఉండగా, ప్రస్తుతం వీరిద్దరిపై సూళ్ళూరుపేట పీఎస్‌లో 4 కేసులు నమోదై ఉన్నాయి.​ఈ ముఠా 2025 నవంబర్‌లో సూళ్ళూరు పేట టౌన్ కరెంట్ ఆఫీసు వద్ద, డిసెంబర్‌లో ఆర్యబట్టానగర్ వద్ద, 2026 ఏప్రిల్‌లో ఎస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట, అలాగే జులై నెలలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి వీధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు సొత్తును అపహరించింది. అంతేకాకుండా మే నెలలో తిరుపతిలో కేటీఎం బైకును కూడా దొంగిలించారు.​తిరుపతి జిల్లా ఎస్పీ L. సుబ్బరాయుడు ఆదేశాలు, నాయుడుపేట డిఎస్పీ G. చెంచుబాబు పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ, సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది శుక్రవారం సూళ్ళూరుపేట పట్టణాల్లోని శ్రీచెంగాళమ్మ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.​ఈ సందర్భంగా నాయుడుపేట డిఎస్పీ G. చెంచుబాబు మాట్లాడుతూ.. ప్రజలు రాత్రి సమయాల్లోనూ, ఒంటరిగా వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేరస్థులు ఎంతటివారైనా వదిలేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. కేసును అత్యంత ప్రతిభావంతంగా, త్వరగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీఐ ఎం. మురళీకృష్ణ, ఎస్సై గంటా అజయ్ కుమార్ మరియు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అసాధారణ రీతిలో నేరాలను కట్టడి చేస్తున్న పోలీసు సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper