జగద్గిరిగుట్టలో పాము కలకలం: ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోవడమే కారణం?

July 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : జగద్గిరిగుట్ట పరిధిలోని పొలాల బస్తి, రోడ్ నంబర్ 7 లో మంగళవారం పాము కలకలం సృష్టించింది. ఓ స్థానిక నివాసి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెత్తాచెదారం పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో, అక్కడ పెద్ద ఎత్తున ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.బాధితు తెలిపిన వివరాల ప్రకారం… తన ఇంటికి ఆనుకుని ఉన్న ఖాళీ ప్లాట్‌లో గల చెత్తాచెదారం వల్ల నిత్యం ప్రమాదకరమైన పాములు ఇంటి పరిసరాల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక పెద్ద పాము సంచరించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ విషయంపై సదరు ఖాళీ స్థలం యజమానికి ఎన్నిసార్లు విన్నవించినా, చెత్తను తొలగించి స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచమని వేడుకున్నా అతను పెడచెవిన పెడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. యజమాని నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి, సదరు స్థల యజమానికి నోటీసులు జారీ చేసి, ఖాళీ ప్లాట్‌లోని చెత్తను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని బస్తి వాసులు కోరుతున్నారు…

🌐 Select Language:
📰 ePaper