జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
గుగులోత్ రామ్ చందర్ సిపిఐ జిల్లా నాయకులు
పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18.న 5.లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ప్రజా సంఘాలకు మహిళలకు విద్యార్థి యువజన రైతులు వ్యవసాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ ప్రతినిధులు శ్రేణులు వేలాదిగా తరలివస్తున్న ఈ బహిరంగ సభను ఎర్ర చొక్కలు ఎర్ర చీరలు ధరించి ఖమ్మంలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా నాయకులు గోలియా తండా గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యుడు గుగులోత్ రామ్ చందర్ ను మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి అయిత శ్రీరాములు ఐలా నాగార్జున చారి ఎజ్జు భాస్కర్ గూగులోత్ శ్రీను డేగల రమేష్ వి సతీష్ టి మధు టి లక్ష్మణ్ సిహెచ్ కోటేష్ ఈ రాధాకృష్ణ జె వెంకన్న జి సోనీ ఈ విజయలక్ష్మి జయమ్మ తదితరులు పాల్గొన్నారు ఎండ్ న్యూస్