
పయనించే సూర్యుడు అక్టోబర్7 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం
మడితాడు గ్రామపంచాయతీ మడితాడు కు చెందిన సన్నకారు రైతు షేక్ ఇర్షద్ కుమారుడు మరియు జనసేన కుటుంబ సభ్యుడు యాసిన్ ఇటీవల కొద్ది రోజుల క్రితం రాయచోటి రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు ఎడమ వైపు కుడి కన్ను వీపు భాగంలో భుజంపై గాయా లవ్వి, కుడి కాలు బాగా ఫ్యాక్షర్ అవ్వడంతో తిరుపతి సంకల్ప ఆసుపత్రిలో వైద్యులచే కుడి కాలు అరికాలు పాదం నుంచి మోకాలు,తొడ భాగాలలో సర్జరీ చేపించుకుని డిశ్చార్జ్ అవ్విన తదనంతరం మడితాడులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ స్థానిక జనసేన శ్రేణులు మరియు మిత్రబృందంతో కలిసి తన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలుపుతూ.. వైద్య నిపుణుల సలహా మేరకు త్వరగా కొలుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడపజిల్లా జనసేన మాజీ సోషల్ జస్టిస్ సభ్యులు షేక్ సలీమ్,కూటమి నేతలు, జనసైనికులు స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.