జర్నలిస్ట్ బూర్గుల రమేష్ కు జర్నలిస్టుల సన్మానం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ యువ జర్నలిస్టు బూర్గుల రమేష్ ను షాద్నగర్ సీనియర్ జర్నలిస్టులు కేపి మరియు రంగనాథ్, రాఘవేందర్ గౌడ్ సన్మానించారు. రమేష్ జన్మదిన సందర్భంగా రమేష్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ పెద్ద ప్రజలకు బాసటగా నిలుస్తూ అదేవిధంగా మరోవైపు అక్షరంతో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్న జర్నలిస్టు రమేష్ ను వారు అభినందించారు..
