జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: మక్తల్ సిఐ రామ్ లాల్
{పయనించే సూర్యుడు} {న్యూస్ 26మక్తల్}
మక్తల్ సర్కిల్ పరిధిలోనీ మక్తల్, ఉట్కూరు మాగనూరు కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండిగ్లో వున్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ రామ్ లాల్ ఒక ప్రకటనలో ప్రజలకు తెలిపారు.ఈ నెల 28వ తేదిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో మక్తల్, నారాయణపేట కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడును. ఈ లోక్ అదాలత్ ద్వారా చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులతో పాటు రాజీపడదగిన సివిల్ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ఫండ్ కేసులు, చెక్బౌన్స్కేసులు, వైవాహిక కేసులు, తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్ కేసులకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్నందు ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని. ఇరువర్గాల కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగించుకోని సమస్యలను పరిష్కరించుకోవాలని. మరిన్ని వివరాలను లోకల్ పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాల్సిందిగా సిఐ తెలిపారు.