PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భగీరత్‌పురలో కలుషిత నీటి ఘటన – 8 మంది మృతి, 64 మంది చికిత్స

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.ఇండోర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మరణించడం చాలా విచారకరం. సీఎం […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

జపనీస్ తెలుగుబ్బాయి ఫుడ్ రివ్యూ… నెటిజన్లు ఫిదా

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైమ్‌లో కడుపుబ్బా నవ్వించాలంటే రీల్స్‌, షార్ట్స్‌తోనే అవుతుంది. అయితే సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టకునేందుకు కంటెంట్‌ క్రియేటర్లు డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఐడియాలో కంటెంట్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో సరిహద్దులన్ని చెరిపేసి.. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.దీంతో చాలా మంది భారీ జనాభా ఉంటే మన దేశంలోని పలు భాషల్లో కూడా వీడియోలు చేస్తూ మన నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

శ్మశానంలో అస్థికల చోరీ ఘటన- లాకర్ పగలగొట్టి అస్థికలు అపహరణ

పయనించే సూర్యుడు న్యూస్ :హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా శ్మశానవాటికలో దుండగులు, అక్కడ లాకర్లను పగులగొట్టారు. అందులో ఓ వృద్ధురాలి అస్థికలను ఎతుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోలన్ జిల్లాలోని చంబాఘాట్ శ్మశానవాటిక ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అస్థికలు భద్రపరిచే గది వైపు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక లాకర్ తాళాన్ని పగులగొట్టారు. లోపల ఉన్న అస్థికల కుండను అపహరించారు.

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశంలో మరో రైలు ప్రమాదం.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :దక్షిణ మెక్సికో దేశంలోని ఓక్సాకా రాష్ట్రంలో ఆదివారం (డిసెంబర్‌ 28) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాండా సిటీలో ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించగా.. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. పట్టాలు తప్పిన ఈ రైలులో తొమ్మిది మంది సిబ్బంది సహా 241 మంది ప్రయాణికులతో కలిపి 250 మంది ఉన్నట్లు మెక్సికన్ స్థానిక మీడియా సంస్థ

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

రైల్వే భద్రతలో లోపమా? ఎర్నాకుళం రైలులో అగ్ని ప్రమాదం

పయనించే సూర్యుడు న్యూస్ :టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి SP తుహిన్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ్యక్తి 71 సంవత్సరాల వ్యక్తని, పెద్ద వయసుకావడంతో ఆయన బయటికి రాలేకపోయారని SP తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వేరే ట్రైన్‌ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం పంపించామన్నారు.

Scroll to Top