జీ20 సమావేశానికి మోదీ పర్యటన: దక్షిణాఫ్రికాలో కీలక చర్చలు
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నవంబర్ 22 నుంచి 23 వరకు జరగనున్న 20వ జీ20 నాయకుల సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు ప్రత్యేకమైనందని, ఆఫ్రికాలో జరగనున్న మొదటి జీ20 సమావేశం అవుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు 2023లో భారతదేశ జీ20 అధ్యక్షత సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తి సభ్య దేశంగా చేర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. […]




