PS Telugu News
Epaper

జాతీయ స్థాయిలో నంద్యాల జిల్లా కు గర్వకారణం”

📅 06 Oct 2025 ⏱️ 4:29 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 7,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

  • సేవా మనసుతో గుర్తింపు తెచ్చుకున్న రాచమడుగు చందు, సుందర్ హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించిన “గాంధీ ఇన్‌స్పిరేషనల్ అవార్డు–2025” కార్యక్రమంలో నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, రాచమడుగు సుందర్‌లు జాతీయ స్థాయి సేవా పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా వీరికీ అందజేశారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, జనయేత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన 15 మంది వ్యక్తులను ఈ సందర్భంగా గౌరవించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ తరఫున సేవా నిబద్ధత, సాత్వికతతో ముందంజలో ఉన్న రాచమడుగు చందు, సుందర్‌లకు ఈ గౌరవం లభించడం నంద్యాల ప్రాంతానికి గర్వకారణమైంది. సేవా భావంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటామంటూ చందు, సుందర్‌లు తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” అన్న భావనతో ప్రేరణ పొందామని, గాంధీజీ మార్గదర్శకత్వమే తమకు సేవా దీక్షను కలుగజేశిందని వారు పేర్కొన్నారు. జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నామని, యువతలో సేవా స్పూర్తిని నింపేందుకు ఇది ప్రోత్సాహకర ఘట్టమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, సామాజిక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశమంతటా నలుమూలల సేవా కర్తల్లో తమదైన ముద్ర వేసుకున్న రాచమడుగు చందు, సుందర్‌లకు ఈ జాతీయ గౌరవం దక్కడం నంద్యాల ప్రజలకు గర్వకారణమైంది.
Scroll to Top