జాతీయ స్థాయి కబడ్డి పోటీలకు తండ క్రీడా క్రీడాకారిణి ఉష
పయనించే సూర్యుడు గాంధారి 17/12/25
జాతీయ స్థాయి ఎస్జీఫ్ అండర్ 17 బాలికల కబడ్డి పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన బానోత్ ఉష ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు,గుడివెనక తండ గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతీ బాయిల రెండవ కూతురు ఉష స్తానిక పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటుంది, క్రీడల్లో చురుకుగా కనబడటంతో వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయి కి ఎంపిక అయినట్లు ఉష వివరించింది, నవంబర్ నెలలో 8 నుండి పది వరకు భద్రది కొత్తగూడెం జిల్లాలోని వొద్దులబయ్యారం పినపాక ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్తాయి పోటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు నుండి ప్రాతినిధ్యం వహించిన ఉష అద్భుతంగా రాణించింది. దీనితో రాష్ట్ర ఎస్జీఫ్ సమాఖ్య ఉష ను ఈ నెల 24 నుండి మహారాష్ట్ర లోని కొప్పుర్ గావ్ లో జరిగే జాతీయ స్థాయి కబడ్డి పోటీలకు తెలంగాణ జట్టు కోసం ఎంపిక చేసినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఒక పేద కుటుంబానికి చెందిన క్రీడాకారిణి జాతీయ స్థాయి కి ఎంపిక అవ్వడం పట్ల గ్రామ సర్పంచ్ రవి నాయక్ ఉపసర్పంచ్ సంతోష్ గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.