PS Telugu News
Epaper

జిల్లా ఎస్పీ ఆదేశాలతో శక్తి ఆప్ అవగాహన

📅 27 Sep 2025 ⏱️ 4:58 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 28:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ)

బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రాంతంలో మహిళలకు భద్రతా పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి హెడ్‌క్వార్టర్‌ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా ఎస్ఐ అనిత ఆధ్వర్యంలో సిబ్బంది మహిళలకు ,శక్తి యాప్, డౌన్లోడ్ విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వెంటనే పోలీసుల సహాయం పొందే విధానంపై పూర్తి వివరాలు తెలియజేశారు. మహిళల రక్షణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అవగాహన కల్పించారు.జనసంచారం ఎక్కువగా ఉండే బీచ్ ప్రాంతాల్లో మహిళలు ధైర్యంగా, భద్రతతో విహరించేందుకు ఈ యాప్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి బృందం ముని బాబు జానకి స్వప్న తదితరులు పాల్గొన్నారు

Scroll to Top