PS Telugu News
Epaper

జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి గ్రామ అభివృద్ధి కి వినతి పత్రం

📅 29 Jan 2026 ⏱️ 5:23 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ ప్రకాశ్ రావు

పయనించే సూర్యుడు, జనవరి 29, అశ్వాపురం:

ఈ రోజు జిల్లా పంచాయతీ అధికారిని అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లు కలసి అశ్వాపురం గ్రామపంచాయతీకి కావలిసిన అదనపు ట్రాక్టర్, గ్రామపంచాయతీ బిల్డింగ్ స్థలం, వారంతపు సంతకు స్థలం మరియు గ్రామపంచాయితీ అదనపు సిబ్బంది కొరకు మెమొరాండం ఇవ్వనైనది.
మెయిన్ రోడ్డుకు ఇరువైపుల సుమారుగా నూట అరవై దుకాణములు కలవు. గ్రామ పంచాయితీ పెద్దది కావడం వలన ఇంటింటికి చెత్త సేకరణ చేయుటకు ఉన్న ఒక ట్రాక్టర్ ద్వారా సాధ్యం కావడం లేదు అని.
గత రెండు సంవత్సరాలు గా గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు లేక సుమారు నూట నలభై వీధులలో తడి చెత్త, పొడి చెత్త, కు ఊర్లో ఉన్న చెత్త చెదారం, ముళ్ళ కంపలు, పెంట దిబ్బలు మొదలగు వాటి వల్ల పారిశుద్ధ్యం చేయుటకు బాగా ఇబ్బంది అవుతుంది. అని గ్రామపంచాయితీకి అదనపు ట్రాక్టర్ ,ట్రాలీ మరియు అదనపు సిబ్బంది ఐదు గురుని నియమించడం కొరకు డీపీఓ కి మెమొరాండం అందించడం జరిగింది.
అశ్వాపురం మేజర్ పంచాయతీ కావున సంవత్సరానికి వారం వారం సంత ద్వారా రూ. ఆరు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. కానీ ఇట్టి నిర్వహించే వారపు సంత అశ్వాపురం ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డుకు ఇరువైపులా కలదు. ఇట్టి వారంతపు సంతకు సరైన స్థలం లేకపోవడం వల్ల రోడ్డు పై వచ్చే పోయే వాహనాలకు రైతులకు, పాడె పశువులకు, ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతూ ఏన్నో యాక్సిడెంట్లు కు గురి అవుతున్నాయి అని తెలియజేయడం జరిగింది.గ్రామపంచాయతీ భవనం అప్పటి ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ జలగం వెంగళ రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై వ సంవత్సరం లో అనగా యాభై ఐదు సంవత్సరాల క్రితం అప్పటి గ్రామ జనాభా ప్రకారం గ్రామ పంచాయతీని చిన్న చిన్న గదులతో బిల్డింగ్ ను నిర్మించడం జరిగింది. ఇప్పుడు అట్టి గ్రామపంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉండి అనేక సార్లు బిల్డింగ్ ను మరమత్తులు చేసిన కూడా స్లాబ్ పెచ్చులు రాలి మీద పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా ఇరవైవేలు పైన కలిగి ఉన్నారు. సదరు అశ్వాపురం లో వివిధ ప్రభుత్వస్థలాలు. ఆర్ అండ్ బి ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్,వెటర్నరీ హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఖాళీ స్థలాలను డిపిఒ కి చూపించడం జరిగింది.ఇట్టి విషయాలు అన్నిటిని త్వరగా పరిష్కరిస్తానని డి పి ఓ చెప్పడం జరిగింది.

Scroll to Top