ఝరి బి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఝరి బి గ్రామం లో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి చాలా మంచి అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారు గ్రామంలో ఇల్లు కట్టుకోవాలని సూచించారు అలాగే ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు దుర్వినియోగం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల బెనిఫిషర్ ఖాతాలోని నేరుగా వేస్తుంది. ఎవరికి లంచం ఇవ్వకుండా నేరుగా ఎక్కడ ఆగకుండా నేరుగా పని అవుతుంది. బెస్నిట్ మీట్ లెవెల్ వరకు లక్ష రూపాయలు, డోర్ లెవెల్ కు లక్ష రూపాయలు. స్లాబ్ కొరకు లక్ష 40 వేల రూపాయిల వరకు వెంట వెంటనే అమౌంటు పడడం జరుగుతుంది. ఇంద్రమ్మ రాజ్యం గరీబోళ్ల రాజ్యం కాబట్టి గ్రామంలో ఇల్లు లేని వారు తప్పకుండా మాకు పేరు ఇవ్వండి వారిని ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇండ్ల మంజూరుకు కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , ముధోల్ నియ ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి , నారాయణరావు పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ జెడ్పిటిసి ఉత్తం భలేరావు బోసి, నందగావ్ మాజీ సర్పంచ్ షేక్ అబ్దుల్ ఘని మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ పటేల్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దిగంబర పటేల్, మౌలాఖాన్ , బొడ్డోళ్ళ నాగన్న , ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు