( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు ఖాజా పాషా కెపి టి డబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా జేఏసీ నేతలు శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఖాజా పాషా కేపీ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మున్ముందు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు ఫెడరేషన్ లో నాయకులు తమ వంతు బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చి జిల్లాలోని తద్వారా రాష్ట్రంలోని జర్నలిస్టులకు అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.ఈ ప్రాంతం నుండి సమాచార సేవలు ప్రజలకు అందిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ అందరికీ సహకరిస్తున్న మీడియా నేతలు ఫెడరేషన్ లో మంచి గుర్తింపు సాధించడం ఈ ప్రాంతానికి వన్నెతెచ్చిందని వారు పేర్కొన్నారు. ఖాజా పాషా కెపి ని షాద్ నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ.కరుణాకర్, గ్రేడ్ వన్- శాఖ గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, జేఏసీ కోశాధికారి గొర్ల రాము తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు.

