టిడిపి కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
పయనించే సూర్యుడు నవంబర్ 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ రచయిత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం విశిష్టతను కొనియాడారు.కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ,మాజీ ఎంపిపి వేలూరు రంగయ్య, వేములపాడు సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, తాడిపత్రి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పరిమి శ్రీహరి,టిడిపి నాయకులు ఆదినారాయణ,విశ్వనాథ్, తిరం పురం నీలకంఠ,రాజశేఖర్,తాండ్ర విక్రమ్ మధురాజు,గన్నే రమేష్, ఉదయ్, బొట్టు శేఖర్,హాజీపీరా, గోపాల్ నాయుడు,చంద్రశేఖర్ రెడ్డి, కూన వెంకట స్వామి,చాంద్ భాష,రఫి, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.
