PS Telugu News
Epaper

టి టి డి చైర్మన్ బి.ఆర్. నాయుడు ను పదవి నుండి తొలగించండి

📅 04 Apr 2026 ⏱️ 6:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడండి ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ డిమాండ్!!

పయనించే సూర్యుడు ఏప్రిల్ 04:

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, టి టి డి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ BR. నాయుడు ను ఆ పదవి నుండి భర్తరఫ్ చేయాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం మెయిన్ రోడ్డులో గల వెంకటేశ్వరస్వామి గుడి వద్ద మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన, ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టి కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రత్యేకపూజలు నిర్వహించిఅనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టకు కలంకం తెస్తున్న టి టి డి చైర్మన్ బిఆర్ నాయుడు ను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాస్ రాజు, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాసి మునికుమారి, జడ్పిటిసి సభ్యులు దొమ్మెటి సామ్యూల్ సాగర్, కాట్రేనికోన మండల జడ్పిటిసి నేల కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకులు వల్లభుని దొరబాబు,ఐ పోలవరం మండల అధ్యక్షులు పిన్నంరాజు శ్రీనివాసరాజు, తాళ్లరేవు మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, కాట్రేనికోనమండల అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి,మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Scroll to Top