టీసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివినగుల చక్రపాణి
నిర్మల్ జిల్లా క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను (ది తెలంగాణ గోల్డ్కప్) వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు, టీసీఏ నిర్మల్ జిల్లా అధ్యక్షలు బోస్లే బాజీరావు పటేల్ , ప్రధాన కార్యదర్శి మురళి, జట్టు కోచ్ రామరాజ్ టీసిఏ మీడియా మెంబర్ మణికేత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా స్థాయిలో ఈనెల 30 ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రం లో గండి రామన్న సాయి బాబా దేవాలయం సమీపంలో గల ప్రత్యేక శిక్షణ కేంద్రంలో క్రికెట్ ఎంపికలు ఉంటాయని తెలిపారు.క్రీడాకారుల వయసు 23 సంవత్సరాల లోపు ఉండాలని, క్రికెట్ కిట్, వైట్ డ్రెస్తో మరియు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరుకావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల మేరకు 9912939724 / 9613131143 నెంబర్లని సంప్రదించాలని సూచించారు.