టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధన
టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధపయనించే సూర్యుడుడిసెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి : తెలంగాణ ప్రభుత్వం, మరియు టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం టేకులపల్లి మండలంలో కేంద్రంలో ఉన్న మరనాత విశ్వాస సమాజంలో సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తహసిల్దార్ లంకపల్లి వీరభద్రం హాజరై మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జి. రాజు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల వారు జరుపుకునే ఘనమైన పండుగ క్రిస్మస్ పండుగ అని, ఏసు క్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తము ఈ భూలోకానికి వచ్చారని, ఆయన యందు నమ్మకు ఉంచిన వారిని రక్షించే వాడని వారు తెలియజేశారు. ప్రేమ, కరుణ, జాలి శాంతిని ఏసుప్రభు వారు చూపించారని అన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రేమ ఇందులో క్రైస్తవులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జి రాజు, సెక్రటరీ బోయాజ్, ఉపాధ్యక్షులు పిల్లి అబ్రహం, పాస్టర్స్ బల్లెం జాన్ రాజు, బల్లెం కమలాకర్, గుమ్మడి రాజకుమార్, తార బాయి, దావీదు, హనోక్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.