PS Telugu News
Epaper

టేకులపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

📅 22 Oct 2025 ⏱️ 6:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి: బుధవారం టేకులపల్లి మండలం నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పర్యటన..సీసీ రోడ్డు శంకుస్థాపన,నూతన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరు.హరతులతో ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు,శాలువాతో ఘనంగా సన్మానించిన గ్రామస్థులు.(పదమూడు లక్షల యాభై మూడు వేల రూపాయలు) 13,53,000 /- వ్యయం గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను,6,06,000/- (ఆరు లక్షల ఆరు వేల రూపాయల) వ్యయం గల కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేత.టేకులపల్లి మండలం మద్రాస్ తండా, బిల్లుడు తండా, పానుగోతు తండా, కొప్పురాయి (ప) కొత్తూరు – దారపాడు సీసీ రోడ్డు, మొక్కంపాడు అంగన్ వాడీ భవనం ప్రారంభోత్సవం.సులానగర్ నందు పూర్తి అయిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం. సొంతింటి కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు.పర్యటనలో భాగంగా గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్లను, ప్రభుత్వ పాఠశాల లను ఆకస్మిక తనిఖీ…,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులుపై ఆరా, సాంకేతిక సమస్యలు వెంటనే పరీష్కరించె విధంగా అధికారులు చురుకుగా పనిచేయాలంటూ అదేశం. నిర్లక్ష్యం వహిస్తె కఠిన చర్యలు తప్పవు…ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఎంపీడీవో మల్లీశ్వరి, ఎమ్మార్వో వీరభద్రం, సీఐ బత్తుల సత్యనారాయణ , బోడు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి , పి ఆర్ ఏ ఈ నవీన్ , హౌసింగ్ ఏఈ గణేష్ , మండల అధ్యక్షులు దేవా నాయక్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా, మాజీ ప్రజా ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top