
పయనించే సూర్యుడు బాపట్ల మే:- 8 రిపోర్టర్( కే శివ కృష్ణ )
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపియస్) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చిత్రం నాటకం ఈనెల 10వ తేదీన చీరాలలో అంబేద్కర్ భవన్లో జరుగుతున్న కరపత్రంను జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆవిష్కరించడం జరిగినది …. రాజ్యాంగ నిర్మాత, అనేకమందికి స్ఫూర్తి ప్రదాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత పై రూపొందించిన నాటకం ను కుటుంబ సమేతంగా చూడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపునివ్వడం జరిగినది ……. సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి టి కృష్ణమోహన్, కెవిపిఎస్ చీరాల పట్టణ ఉపాధ్యక్షులు యన్ బాబురావు మాట్లాడుతూ ఆధునిక రంగస్థలం అరుగుపైన విశ్వ జ్ఞాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రం, నాటకం కెవిపిఎస్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారంతో సంఘం ,చరణం, గచ్చామి అనే కళారూపం ద్వారా డాక్టర్ అంబేద్కర్ జీవితచరిత్ర ను సామాజిక చైతన్య సాంస్కృతి ఉత్సవాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22న కర్నూల్ లో ప్రారంభమై ఈనెల 10వ తేదీన చీరాలలోని బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ భవన్లో జరుగుతున్నాయని అందరూ కుటుంబ సమేతంగా వచ్చి జయప్రదం చేయాలని కోరారు, సమాజమే తన కుటుంబంగా భావించి, కన్నబిడ్డ చావు ను కూడా, వెలివాడల బతుకు భద్రత కోసం త్యాగించిన ధీరుడు, మనవాద పై పోరాటం నిర్వహించి, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేకమందికి ఆదర్శవంతంగా ఉన్నారు, అలాగే అంబేద్కర్ పై కేంద్ర ప్రభుత్వం విషం జిమ్ముతున్న నేపథ్యంలో అయన త్యాగాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ నాటకం వేయించటం జరుగుతున్నది. కావున అంబేద్కర్ కొందరు వాడు కాదు, అందరివాడే అన్న సత్యాన్ని ప్రజా ముంగిట ఉంచేందుకు చేస్తున్నా ప్రయత్నానికి కుటుంబ సమేతంగా హాజరై, నాటకాలు చూసి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ,ఈనెల 10వ తేదీన సాయంత్రం చీరాలలో అంబేద్కర్ భవన్లో జరుగుతున్న నాటకం జయప్రదం చేయాలని కోరారు..