
రుద్రూర్, మే 09(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, బొప్పాపూర్ గ్రామానికి చెందిన యాబాజీ సాయిలు, తండ్రి పేరు సాయిలు అను వ్యక్తి పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి మూడు రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా రాణంపల్లి గ్రామానికి చెందిన వీరేశం, తండ్రి పేరు రాజన్న అను వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ శేష తల్ప సాయి తీర్పు వెల్లడించారు.