డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారము ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం నందు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు యాడికి ఐదో సచివాలయం నందు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగినది అలాగే నారాయణస్వామి కాలనీ నందు ప్రజలకు ఫ్రైడే డ్రైడే మీద డెంగు మలేరియా చికెన్ గునియా టైఫాయిడ్ మొదలు జ్వరాలు మీద అవగాహన కల్పించడం జరిగినది అలాగే ప్రతి శుక్రవారం నీటి తొట్లను శుభ్రముగా కడుక్కొని ఒక గంట ఆరబెట్టిన తర్వాత మరియు మీరు నింపుకోవాలని తెలియజేయడం జరిగినది వార్డు నందు ప్రజలు మురికి కాలువల నందు చెత్తాచెదారము వ్యర్థ పదార్థాలు వేయకూడదని ప్రజలకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు సి హెచ్ ఓ జుబేదా మేడం పీహెచ్ఎన్ శోభకుమారి మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ స్వర్ణలత మేల్ హెల్త్ అసిస్టెంట్ మద్దిలేటి ఆశా కార్యకర్తలు మహబూబ్ బి సుజాత వరలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు
