PS Telugu News
Epaper

ఢిల్లీలో అవార్డు అందుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబి

📅 01 Apr 2026 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1

వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ హానరి పేరుతో ఢిల్లీలో గల ఈ సంస్థ ప్రతి సంవత్సరము వివిధ రంగాలలో విశేషమైన సేవలు అందించిన వారికి డాక్టరేట్ అవార్డులను ప్రధానంచేసి ప్రోత్సహించడం జరుగుతున్న తరుణంలో ఆ అవకాశం ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తాటిపాకకు చెందిన కంచర్ల వేంకట్రావు (బాబి)కి దక్కింది గత నెల 31వ తేదీన ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో బాబీ చేసిన సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా ఈ యొక్క ప్రతిష్టాకరమైన డాక్టరేట్ అవార్డును ఉత్తర ప్రదేశ్ మంత్రివర్యుల చేతులు మీదుగా అందించగా బాబీ కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమాలు పాల్గొని అవార్డును అందుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరములుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఆయన చేస్తున్న ఎనలేని సేవలకు గాను
ఈ యొక్క గుర్తింపు లభించిందని తెలిసింది సంఘ అధ్యక్షుడు గా ఆర్థికంగా వెనుకబడిన వారికి కలిగిన కష్టాలను వివిధ రూపాలలో సాయం అందించడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలతో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడంతోపాటు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేయడం ఆరోగ్య సమస్యలతో బాధపడి ఆసుపత్రిలో ఉంటున్న వారికి ఆర్థిక సహాయం అందించడం వధువు వరుల పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం సమాజంలో ఆర్యవైశ్యుల ఉన్నతికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం తన సమయాన్ని ఎంతగానో కేటాయించి పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం వంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని
ఈ యొక్క అవార్డుకు బాబీని ఎంపిక చేయడం జరిగిందని పై సంస్థ వారి ద్వారా తెలిసింది ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ నేను ఏ విధమైన కార్యక్రమాలను చేపట్టిన నావెంట ఉండి నాకు వివిధ రూపాలలో సహకరిస్తూన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారంతోటే ఈ అవార్డు నాకు అందిందని ఇది నా ఒక్కడి వల్లన నాకు వచ్చిన అవార్డుగా భావించటం లేదని మీ అందరి వలన వచ్చిన అవార్డుగా భావిస్తున్నానని అవార్డుతో నన్ను సత్కరిస్తున్న తరుణంలో నేను మన అందరిని సత్కరించినట్టుగా భావించానని నేను సంఘంలో గాని సమాజంలో గాని పలు సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మీరు అందరూ నా కూడా ఉండి వివిధ రూపాల్లో సహకరించడం అనే విషయాన్ని నేను జీవితంలో మరువలేనని బాబి అన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఎంతో నమ్మకంతో తనకు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు శివరామ సుబ్రహ్మణ్యం అప్పగించడంతో నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు అవార్డు అందుకున్న అనంతరం రాజమండ్రి లో ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం ను కలిసి
ఆ యొక్క అవార్డును, ప్రశంసా పత్రాన్ని ఆయనకు చూపించి బాబి తన ఆనందాన్ని ఆయనతో పంచుకోవడం జరిగింది.

Scroll to Top