తండా అభివృద్ధికి సహకరిస్తా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ కు సన్మానం
మాజీ సర్పంచ్ మరియు డిప్యూటీ సర్పంచ్ వార్డ్ నెంబర్లకు సన్మానం
( పయనించే సూర్యుడు డిసెంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా నూతన సర్పంచ్ గా ఎన్నికైన మూడవత్ రాజు నాయక్ చౌహన్ ను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈరోజు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కడియాల కుంట తండా అభివృద్ధికి సహకరిస్తానని అందరూ కలిసికట్టుగా తాండ ను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం సర్పంచ్ తో పాటు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ మరియు మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మరియు ఒకటో వార్డ్ నెంబర్ తావు సింగ్, రెండో వార్డ్ నెంబర్ తావు సింగ్, మూడో వార్డు నెంబర్ ప్రియాంక దేవేందర్ , నాలుగో వార్డ్ నెంబర్ దేవి రవి నాయక్ , ఐదో వార్డ్ నెంబర్ నీలా భాస్కర్ నాయక్ , ఆరవ వార్డు చాట్ పట రవీందర్, ఏడో వార్డ్ నెంబర్ గోపి నాయక్, ఎనిమిదో వార్డ్ నెంబర్ జ్యోతి రాజు నాయక్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానించారు.
