తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలి…
- బీజేపీ మండల అధ్యక్షులు ఆలాపాటి హరికృష్ణ…
రుద్రూర్, అక్టోబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ లేదని, వెంటనే మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి తడిసిన ధాన్యంతో అన్నిటిని తొందరగా కొనుగోలు చేయాలని రుద్రూర్ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.