PS Telugu News
Epaper

తడిసి మొలకెత్తిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

📅 25 Oct 2025 ⏱️ 2:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు:అతివృష్టివల్లచేతికందినమొక్కజొన్న పంట తడిసి మొలకెత్తుతోందని ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దుఃఖంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ సిపిఐ ఎంఎల్ డివిజన్ నాయకులు ఆవుల కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం నాడు ఆ పార్టీ ప్రతినిధి బృందం వీరాపురం ముత్తారపు కట్ట మసివాగు శాంతినగర్ మాణిక్యారం తదితర గ్రామాల్లోఅతివృష్టి వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటనుపరిశీలించారు అనంతరం వారు రైతులతో మాట్లాడారు. ఈ సంవత్సరం రైతుకి ఏదీ కలిసి రావడం లేదని తీవ్రమైన వర్షాలు ఎరువుల కొరత అనేక ఇబ్బందులతో పండించిన పంట చేతికందిన సమయంలో ఉత్తరపు కట్ట మాణిక్యారం కొమరారం పోలారం మర్రిగూడెం తదితర ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పెట్టిన పెట్టుబడి కుటుంబాన్ని సాదడం ఎలా అని ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైననే ఉందని వారన్నారు తక్షణమే ఇల్లందు మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తడిసిన ముక్కిన మొలకెత్తిన మొక్కజొన్న పంటను మద్దతు ధర 2400 రూపాయలతో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే రైతుల ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆదుకునే చర్యలు చేపట్టకపోతే పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బానోతులస్కర్ సువర్ణపాక రామ్మూర్తి కిషన్ చాట్ల వెంకన్న శంకర్ చందు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top