తపస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా నరసింహ
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి2} మక్తల్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మక్తల్ పట్టణం లోని కాకతీయ స్కూలు లో ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ మండల అధ్యక్షుడుగా ఉన్న బొమ్మనపాడు రవీందర్ ను నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందున ఆయన స్థానంలో మక్తల్ మండల అధ్యక్షుడిగా గుడిగండ్ల నరసింహ ని, గౌరవ అధ్యక్షులుగా ఆత్కూర్ నర్సిరెడ్డి ని, ప్రధాన కార్యదర్శిగా రాకేష్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులుగా భీమ్ రెడ్డి మరియు వెంకట రాములు గార్లు వ్యవహరించగా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా. గౌరవ అధ్యక్షులు నర్సిరెడ్డి., అధ్యక్షులు నరసింహా.మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఉపాధ్యాయుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారం కోసం తాము అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొనడం జరిగింది.తపస్ మక్తల్ మండల కార్యవర్గం :ఉపాధ్యక్షులు గా ప్రహ్లాద్, రామాంజనేయులు, వీణ
సహాయ కార్యదర్శులుగా వనజ,రాజాంజనేయులు,శివజ్యోతి మండల సమన్వయకర్తలుగా జి నరేష్, రాములు, రాము గౌడ్ కోశాధికారిగా అనిల్ రెడ్డి మీడియా ఇన్ఛార్జిగా సురేష్ కాంప్లెక్స్ కన్వీనర్లుగా రవీందర్ రెడ్డి, జగదీష్, సౌమ్య, ప్రవర్ధన్, ప్రకాష్ ,స్వప్న, మదన్, శివరాజ్, మానస. కార్యదర్శులుగా వెంకటేష్ నర్సింలు, కనకాద్రి కమలాకర్ దన్ సింగ్ నరసింహ అంజప్ప సోమనాథ్ భాస్కర్ నాయక్ మహిళా ప్రముఖులుగా అనురాధ, మౌనిక, రమ్య,సాయిపవని, వరలక్ష్మి,జ్యోతి, ప్రతిభ,కల్పన,బిందు తదితరులను ఎన్నుకొన్నారు.
