తల్లిపాలు పసిబిడ్డలకు అమృతం సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్
కడియాల కుంట తండా అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
( పయనించే సూర్యుడు ఆగస్టు 05 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాన్ని అంగన్వాడీ టీచర్ సుజాత,నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. తల్లిపాలు పసిబిడ్డలకు అమృతం లాంటిదని అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే పట్టించాలని సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శరత్ అంగన్వాడీ టీచర్లు సుజాత మరియు నిర్మల మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.