PS Telugu News
Epaper

తల్లి బిడ్డని ఏకం చేసిన సూళ్లూరు పేట సిఐ

📅 10 Apr 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఆవరణంలో బరిసా నుంచి చెన్నై వెళ్తున్న ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ సూళ్లూరుపేట స్టేషన్ లో ఆగినది అందులోంచి ఒక మహిళ నీళ్లు తాగుటకు దిగినది అంత లోపల ట్రైన్ కదిలి వెళ్లిపోయింది ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఆ మహిళ ప్లాట్ ఫామ్ పైనే అటు ఇటు తిరుగుతుంది అది గమనించిన కొందరు వ్యక్తులు పోలీస్ వారికి సమాచారం అందించారు ఆ సమాచారానికి స్పందించిన సీఐ రైల్వే స్టేషన్ లో దిక్కు తోచని స్థితిలో ఉన్న మహిళ దగ్గరికి వెళ్లి ప్రశ్నించుగా ఆమె మాట్లాడుతున్న ఒరిస్సా భాష అర్థం కాక ఒరిస్సా భాష మాట్లాడే ఒక అతని తీసుకొచ్చి ఆమె దగ్గర మాట్లాడించగా ఆమె జరిగిన విషయాన్ని సిఐ కి చెప్పినది అందుకు సీఐ సానుకూలంగా స్పందించిఆమెని హోమ్ తీసుకెళ్లి ఉంచారు తర్వాత సిఐ విచారణ చేపట్టి విచారణ వేగవంతం చేసి మంబోట్లో ఉన్న దాల్మియా కంపెనీ జిఎం మదన్ మాలిక్ ఒరిస్సా అతని సహకారంతో కవర్ పేట ఇటుకుల బట్టి లు వద్దకు వెళ్ళగా విచారించగా ఆమె కొడుకు అక్కడ పని చేస్తూ ఉన్నాడు అతనికి ఆమెని అప్పగించడం జరిగినది ఇంత మంచి కార్యక్రమం చేసిందానికి సిఐ కి ప్రజలు అభినందనలు తెలిపారు

Scroll to Top